ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు జిల్లాలో బ్లాక్ ఫంగస్​ కేసు నమోదు - nandyala latest news

కర్నూలు జిల్లాలో ఒక బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. దీంతో బాధితుడికి నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో చిక్సిత అందిస్తున్నారు.

black fungus case register at Kurnool district
కర్నూలు జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసు

By

Published : May 21, 2021, 7:10 PM IST

కర్నూలు జిల్లాలో ఓ బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. జిల్లాలోని ఎమ్మిగనూరు సమీపంలో సి. నాగులవరం గ్రామానికి చెందిన కె. వి. ప్రసాద్(68) అనే వ్యక్తిలో ఫంగస్​ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో బాధితునికి నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు.

ప్రసాద్​.. అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా నంద్యాలలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. అతనిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఎక్కువగా కనిపించడంతో ఇవాళ నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details