కర్నూలు జిల్లా శ్రీశైలదేవస్థాన పరిపాలన కార్యాలయంలో ఘర్షణ చోటుచేసుకుంది. హిందూయేతర మతాలు దేవస్థానం నిర్వహించే వేలంపాటలో పాల్గొనరాదని నియోజకవర్గ భాజపా ఇన్‌ఛార్జి బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి అడ్డుచెప్పటంతో గొడవ జరిగింది. కోర్టు ఉత్తర్వుల మేరకు శ్రీశైలంలోని లలితాంబా వాణిజ్య సముదాయంలోని దుకాణాలను శ్రీశైలం దేవస్థానం వారు బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వేలంలో అన్యమతస్తులు పాల్గొనడంతో వారికి, శ్రీకాంత్‌రెడ్డికి మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అప్రమత్తమై బుడ్డా శ్రీకాంత్‌రెడ్డిని అదుపులో తీసుకున్నారు. ఈ ఘటనతో వేలం పాట వాయిదా పడింది.
శ్రీశైలదేవస్థాన వేలం పాటలో తోపులాట
హిందూయేతరమతాలు శ్రీశైలదేవస్థాన వేలంపాటలో పాల్గొనరాదని భాజాపా నేతలు అడ్డుచెప్పటంతో దేవస్థాన పరిపాలన కార్యాలయంలో తోపులాట జరిగింది.
bjp leaders prevent non-Hindu religions from participating in temple auctions at srisailam temple tender in karnool district