ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'శ్రీశైలం అక్రమాలపై సిట్టింగ్​ జడ్జితో విచారణ జరపాలి' - శ్రీశైలం దేవస్థానంలో టికెట్ల సొమ్ము స్వాహా

శ్రీశైలం దేవస్థానంలో..రూ. కోట్ల సొమ్ము స్వాహా చేశారని భాజపా నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆరోపించారు. ఈ అక్రమాలలో రాజకీయనాయకుల ప్రమేయం ఉందన్నారు. దేవస్థానంలో జరిగిన అక్రమాలపై సిట్టింగ్​ జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

భాజపా నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి
భాజపా నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి

By

Published : Jun 4, 2020, 3:29 AM IST

హిందూ దేవాలయల్లో ఇతర మతస్థుల పెత్తనం తొలగించే విధంగా సీఎం జగన్​ చర్యలు తీసుకోవాలని భాజపా నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలులో మాట్లాడిన ఆయన... శ్రీశైలం దేవస్థానం సొమ్ము రూ. కోట్లలో స్వాహా చేశారన్నారు. దేవస్థానంలో జరిగిన అక్రమాలలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డ వారిని విడిచి పెట్టి...అనామకులను పట్టుకున్నారని బైరెడ్డి ఆరోపించారు.

శ్రీశైల దేవస్థానంలో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలంలో రజాక్ అనే వ్యక్తి అధికారం చేలాయిస్తున్నారని ఆరోపించారు.


ఇదీ చదవండి :ఎల్​జీ పాలిమర్స్ కేసులో ఎన్​జీటీ కీలక ఆదేశాలు

ABOUT THE AUTHOR

...view details