హైదరాబాద్‌లో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ గ్రామీణ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆమె భర్త భార్గవ్ రామ్ నాయుడుపై ఉన్న పెండింగ్ కేసులో అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై మండిపడ్డారు. యూసుఫ్ గూడ పరిధిలోని భార్గవ్ రామ్ నివాసానికి ఆళ్లగడ్డ సీఐ సుదర్శన ప్రసాద్, ఎస్సై రమేష్ బాబు వెళ్లారు. ఎలాంటి వారెంట్ లేకుండా ఇంట్లోకి రానివ్వనంటూ అఖిలప్రియ తలుపుకు తాళం వేశారు. కర్నూలు ఎస్పీ తనపై కక్ష కట్టారని... ఆళ్లగడ్డ డీఎస్పీకి ఫోన్ చేసి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురుని ఆళ్లగడ్డ పోలీసులు హైదరాబాద్‌లో సోమవారం అరెస్టు చేశారు.
భర్త కోసం పోలీసులపై అఖిల ప్రియ ఫైర్... - akhila priya fireson police on her husband case
భర్తను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులపై మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ మండిపడ్డారు. అరెస్టు వారెంటు లేకుండా ఇంట్లోనికి రానివ్వనంటూ హైదరాబాద్లోని నివాసంలో ధ్వజమెత్తారు.
భర్త కేసుపై పోలీసులపై అఖిల ప్రియ ఫైర్