కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారత్‌బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దుకాణాలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు డిపోకు పరిమితమయ్యాయి.
నంద్యాల..
బంద్‌లో భాగంగా ఈ ప్రాంతంలో వామపక్ష పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు, ప్రైవేటీకరణ, వ్యవసాయ చట్టాలపై కేంద్రం పునరాలోచించాలని నాయకులు డిమాండ్ చేశారు.