ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...12 మంది అరెస్టు - ఆళ్లగడ్డ నేర వార్తలు

ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 12 మందిని అరెస్టు చేసిన ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగింది. నిందితుల నుంచి నగదు, చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

betting gang arrested in allagadda kurnool district
బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు...12 మంది అరెస్టు

By

Published : Sep 25, 2020, 10:52 PM IST

ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న 12 మందిని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు లక్షల 35 వేల రూపాయల నగదు, 8 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాలకు చెందిన ఓ వ్యక్తి... ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతకుంట గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయం వద్ద బెట్టింగ్ నిర్వహిస్తున్నాడన్న సమాచారంతో దాడులు నిర్వహించామని స్థానిక డీఎస్పీ పోతురాజు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details