కర్నూలు జిల్లాలో బ్యాంకుల వద్ద వరుస దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గడివేముల పోలీస్స్టేషన్లో ఏర్పటుచేసిన సమావేశంలో డీఎస్పీ చిదానంద వివరాలను ప్రకటించారు. చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన హరి కృష్ణ , సింధిల్, దీప అనే ముగ్గురు తమిళనాడు రాష్ట్రం తిరుచి పట్టణానికి చెందిన వెంకటేష్ అనే నేరస్థుడితో కలిసి దొంగోతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ. లక్షా 35 వేలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ముఠాపై తమిళనాడు బెంగళూరు తదితర ప్రాంతాల్లో అనేక దొంగతనం కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేయవలసి ఉందని వారు పరారీలో ఉన్నారన్నారు. చాకచక్యంగా దొంగలను పట్టుకున్న పాణ్యం సీఐ నాగరాజు, గడివేముల ఎస్ఐ చిరంజీవిలను డీఎస్పీ అభినందించారు.
పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగలు - బ్యాంకు దొంగలను
బ్యాంకు దొంగతనలాకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను కర్నూలు జిల్లా పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి లక్షా 35వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
అంతర్రాష్ట్ర బ్యాంకు దొంగలను పట్టుకున్న పోలీసులు