కర్నూలు జిల్లా నంద్యాల మండలం గుంతనాల గ్రామ సమీపంలోని పాడుపడ్డ బావిలో ఓ నవజాత మగ శిశువును గ్రామస్థులు గుర్తించారు. బావిలో నుంచి శిశువు ఏడుపు వినిపించడంతో నాగేంద్ర అనే వ్యక్తి గమనించి బయటకు తీసుకొచ్చి గ్రామస్థులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని... శిశువును ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో ఆస్పత్రిలో చేర్పించారు. ఆ శిశువును వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు రూరల్ సి.ఐ. దివాకరరెడ్డి తెలిపారు.
బావిలో నుంచి వినిపించింది ఏడుపు... వెళ్లి చూస్తే నవజాత శిశువు... - nandyal
కర్నూలు జిల్లా నంద్యాల మండలం గుంతనాల గ్రామ సమీపంలో పాడు పడ్డ బావిలో ఓ మగ శిశువును గ్రామస్థులు గుర్తించారు.
బావిలో దొరికిన నవజాత శిశువు