దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా..ఆటో బోల్తా పడి ముగ్గురికి తీవ్ర గాయాలు, మరో నలుగురికి స్వల్ప గాయాలైన ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వర్కూరు సమీపంలో చోటు చేసుకుంది. నందికొట్కూరుకు చెందిన మద్దిలేటి.. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉరుకుందకు వెళ్లారు. ఈరన్న స్వామిని దర్శించుకున్న అనంతరం తిరిగి వస్తుండగా వారి ఆటో బోల్తా పడింది. మద్దిలేటితో పాటు ఆయన భార్య గోవిందమ్మ, వారి కుమార్తె చంద్రకళకు తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురూ చిన్న గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కోడుమూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం 108 వాహనంలో కర్నూల్ ఆస్పత్రికి తరలించారు.
వర్కూరు సమీపంలో ఆటో బోల్తా... ఏడుగురికి గాయాలు - injured
కర్నూలు జిల్లా వర్కూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తాపడి ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆటోబోల్తా