ఆగిన ప్రజా గళం... అరుణోదయ రామారావు హఠాన్మరణం - song
40 ఏళ్లుగా వామపక్ష ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన పోరాట యోధుడు అస్తమించాడు. ప్రజల సమస్యలను పాటతో చెప్పే ఆ గళం ఆగిపోయింది.
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్న రామారావు(65) కన్నుమూశారు. ఈ రోజు ఉదయం గుండెపోటుకు గురైన ఆయనని హైదరాబాద్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి బంధువులు తరలించారు. చికిత్స తీసుకున్నప్పటికీ మధ్యాహ్నం మరోసారి గుండెపోటు రావడంతో 2 గంటల 45 నిమిషాలకు రామారావు మరణించారు. ఈయన స్వస్థలం కర్నూలు జిల్లా ఆదోని కాగా... 40 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోని వామపక్ష ఉద్యమాల్లో క్రియాశీలపాత్ర పోషించారు. డప్పు వాయిస్తూ ప్రజా సమస్యలను పాట రూపంలో చెప్పేవారు. ఆయన భౌతిక కాయాన్ని విద్యానగర్ లోని మార్క్స్ భవన్కు న్యూడెమోక్రసీ నేతలు తరలిస్తున్నారు. నివాళులు అర్పించేందుకు వామపక్షాలు, ప్రజా సంఘాల నేతలు భారీగా తరలివస్తున్నారు.