ఎట్టకేలకు అన్నె జ్యోతికి వివాహం జరిగింది. కర్నూలు జిల్లా మహానంది మండలం తమ్మడపల్లెలో అమరనాథ్తో... పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యుల మధ్య వీరిద్దరి కల్యాణం జరిగంది. మార్చి నెలలో జరగాల్సి వివాహం వాయిదా పడగా.. ఇవాల్టికి ముహూర్తం కుదిరి శుభకార్యం పూర్తయింది.
అసలెవరు ఈ అన్నె జ్యోతి?
చైనాలో వూహాన్ నగరంలో కరోనా విలయతాండవం చేస్తున్న రోజుల్లో... కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన అన్నె జ్యోతి చిక్కుకుంది. టీసీఎల్సెల్ కంపెనీలో ఉద్యోగం రాగా శిక్షణ కోసం వెళ్లిన 58 మందిలో జ్యోతి ఒకరు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో శిక్షణ కోసం వెళ్లిన వారందర్నీ స్వదేశాలకు పంపించేందుకు కంపెనీ ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు.
- స్వదేశానికి వచ్చే నిమిషంలో శరీర ఉష్ణోగ్రత పెరగటంతో అధికారులు అక్కడే ఉంచేశారు. దీంతో మార్చి 14 జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది.
- జ్యోతి అమ్మ.. తన కుమార్తెకు ఎటువంటి వైరస్ సోకలేదనీ, ఆమెను స్వస్థలానికి రప్పించాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
- కేంద్ర అధికారులు చొరవ చూపిన కారణంగా.. చైనా నుంచి జ్యోతి, మార్చి 1న దిల్లీకి చేరుకుంది. అక్కడే 14 రోజులు క్వారంటైన్లో ఉంది.
- అనంతరం దిల్లీ నుంచి క్షేమంగా ఇంటికి చేరింది. నేడు (మే 24) తమ్మడపల్లెకు చెందిన అమర్నాథ్ను పెళ్లి చేసుకొని, నవ వధువుగా అత్తారింట్లో అడుగుపెట్టింది.
సంబంధిత కథనం:
కర్నూలు జిల్లా యువతి పెళ్లికి... కరోనా గండం..!