కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుంది. దీని ప్రభావం అన్ని వర్గాలపై తీవ్రంగా పడింది. పశువులపైనా చెప్పలేని ప్రభావం పడింది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన పత్తి వ్యాపారి రవికుమార్... జంతువుల కోసం ప్రతిరోజు 1500 రూపాయలు పశుగ్రాసానికి ఖర్చు చేస్తున్నాడు. మామూలు రోజుల్లో దుకాణాలు తెరిచి ఉండి పశువులకు దాణా వేసేవారు. పట్టణంలో లాక్డౌన్తో దుకాణాలు మూతబడ్డాయి. ఫలితంగా రహదారిపై ఉండే ఆవులకు, కుక్కలకు, కోతులకు ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్నాయి. వాటి కోసం మేత వేస్తున్నానని రవికుమార్ చెబుతున్నాడు.
ఈ పత్తి వ్యాపారి పశువులకు ఆపద్బాంధవుడు
లాక్డౌన్ ప్రభావం మనుషులపైనే కాకుండా జంతువులపైనా పడింది. రహదారిపై ఉండే పశువులకు ఆహారం దొరకడంలేదు. వ్యాపారి రవికుమార్... జంతువుల కోసం ప్రతిరోజు 1500 రూపాయలు పశుగ్రాసానికి ఖర్చు చేస్తున్నాడు.
ఈ పత్తి వ్యాపారి పశువులకు ఆపద్బాంధవుడు