కర్నూలు జిల్లా డోన్‌లో ఫ్లైఓవర్‌పై కారును తప్పించబోయి ఆర్టీసీ బస్సు రక్షణ గోడను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు బస్సు గోడను ఢీకొని నిలిచిపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. లేకపోతే ఫ్లైఓవర్ నుంచి బస్సు కిందకు పడేది. ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులున్నారు. వీరంతా సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. వంతెన రక్షణ గోడను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - RTC bus collides with flyover in Don
ఫ్లైఓవర్‌పై కారును తప్పించబోయి ఆర్టీసీ బస్సు రక్షణ గోడను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లా డోన్‌లో చోటు చేసుకుంది.
ఫ్లైఓవర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఈ ప్రమాదం వల్ల రహదారిపై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు వంశీ, నూర్భాషా, వరునాధిత్యలపై రక్షణ గోడ పెచ్చలు పడి గాయాలయ్యాయి. వరుణాధిత్యకు తీవ్రగాయలవ్వగా.. వంశీకు భుజానికి గాయమైంది. వీరిని హాస్పిటల్‌కు తరలించారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇదీ చదవండీ..High court: రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్‌లకు జైలు శిక్ష, జరిమానా విధింపు..