స్నేహితుడి ప్రాణాలు బలిగొన్న ప్రేమ వ్యవహారం - kurnool news
15:23 June 02
ప్రేమ జంట పారిపోవడానికి సహకరించాడని యువకుడి పై దాడి
ప్రేమజంట పారిపోయేందుకు సహకరించాడనే అనుమానంతో ఓ యువకుడిని చితకబాదారు యువతి బంధువులు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు మరణించాడు.
కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలో ఈ దారుణం చోటు చేసుకుంది. పేరూరుకు చెందిన ఒక ప్రేమజంట పారిపోయేందుకు సహకరించాడనే అనుమానంతో ప్రవీణ్‌కుమార్ అనే యువకుడిని యువతి బంధువులు వెంబడించారు. యువకుడు ద్విచక్రవాహనంపై పారిపోతుండగా... ఆళ్లగడ్డ మండలం గూబగుండం మెట్ట వద్ద అటకాయించి దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన యువకుడిని సమీప గ్రామస్తులు ఆళ్లగడ్డ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో... కర్నూలు ఆస్పత్రికి తరలించగా.... చికిత్స పొందుతూ మృతి చెందాడు. యువకుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇవీ చదవండి:వివాహేతర సంబంధం: రెండు హత్యలూ.. ఒక ట్విస్ట్