మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కర్నూలు జిల్లా సిరివెళ్ల రుద్రవరంలో పర్యటించారు. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులు పరామర్శించి తగిన న్యాయం చేస్తానని ధైర్యం చెప్పారు. అఖిలప్రియ రుద్రవరం మండలం పేరూరు, శిరివెళ్ళ మండలం ఎర్రగుంట్ల గ్రామాల్లో పర్యటించారు. భారీ వర్షాలకు కాలువలు ఉప్పొంగడంతో 400 హెక్టార్లలో పత్తి పొలాలు నీటమునిగాయి. ఈ రైతులను పరామర్శించి వారికి భరోసా చెప్పారు. వర్షానికి ఇళ్లలోకి నీళ్లు చేరటంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆమె స్వయంగా చూశారు.
కర్నూలు జిల్లా వర్ష బాధిత రైతులను పరామర్శించిన అఖిలప్రియ - famres
భారీ వర్షాలకు నష్టపోయిన కర్నూలు జిల్లా సిరివెళ్ల రుద్రవరం పరిధిలోని రైతులను మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పరామర్శించారు. రైతులకు ధైర్యం చెప్పి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
రైతులను పరామర్శించిన అఖిలప్రియ