ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేపర్ యాషే రంగు... చేతి వేళ్లే కుంచెలు..! - gandhi paper ash drawing update

చిన్నప్పటి నుంచి చిత్రలేఖనంపై మక్కువ.. ఎటువంటి చిత్రాన్నైనా గంటలోపే పూర్తి చేసే నైపుణ్యాన్ని సంపాదించాడు. ఆ ఆసక్తే ఇప్పుడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు సంపాదించిపెట్టిందా యువకుడికి.

record
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు సంపాదించిన ఆదోని యువకుడు

By

Published : Jan 28, 2021, 3:21 PM IST

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు సంపాదించిన ఆదోని యువకుడు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన శ్రీకాంత్​.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు సంపాదించాడు. లక్ష్మి, పద్మనాభాచార్యుల కుమారుడైన శ్రీకాంత్... పేద కుటుంబ నేపథ్యమే అయినప్పటికీ, చిన్నప్పటి నుంచే కళల్లో రాణించేవాడు. విభన్నంగా ఆలోచిస్తూ.. తనకంటూ ఓ ప్రత్యకత చాటుకోవాలని అనుకునేవాడు. ఆ విధంగా చిత్రలేఖనంపై పట్టు సాధించాడు. ఎటువంటి చిత్రమైన గంటలోపే పూర్తి చేసే విధంగా నైపుణ్యం సాధించాడు.

శ్రీకాంత్ గీసిన మహాత్మా గాంధీ చిత్రంతో 2021 సంవత్సరం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో అవార్డు పొందాడు. అందరిలా చేస్తే తనకుంటూ గుర్తింపు ఉండదని... పేపర్ యాష్​తో ఎటువంటి పెన్సిల్, బ్రష్ వంటివి లేకుండా కేవలం చేతి వేళ్లతో గాంధీ చిత్రాన్ని గీశాడు. ఈ నైపుణ్యానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో అవార్డు లభించింది. శ్రీకాంత్.. తాను గీసే చిత్రాలను యూట్యూబ్ ఛానెల్​ ద్వారా ప్రచారం చేస్తున్నాడు.

ఇదీ చదవండి:ఉద్వేగానికి లోనైన భూమా నారాయణరెడ్డి

ABOUT THE AUTHOR

...view details