Cotton Farmers: కర్నూలు జిల్లా ఆదోనిలో నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులు ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. పట్టణంలోని ఎరువుల దుకాణాల నుంచి ఎమ్మెల్యే ఇంటి వరకు నిరసన ర్యాలీ చేశారు. రైతుల ఆందోళనతో వ్యాపారులు ఎరువుల దుకాణాలను మూసివేశారు.
నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులు.. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఇంటి ముట్టడి
Cotton Farmers: కర్నూలు జిల్లా ఆదోనిలో నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. శాస్త్రవేత్తలు నివేదిక అధారంగా ఎరువుల కంపెనీలపై చర్యలు చేపడతామని ఎమ్మెల్యే రైతులకు తెలిపారు.
పత్తి రైతులు
రైతులు పత్తి మొక్కలతో ఎమ్మెల్యే ఇంటి వద్దకు వచ్చి ధర్నా చేశారు. తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. వ్యవసాయ అధికారులుతో నకిలీ విత్తనాలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. శాస్త్రవేత్తల నివేదిక అధారంగా ఎరువుల కంపెనీలపై చర్యలు చేపడతామని ఎమ్మెల్యే రైతులకు తెలిపారు.
ఇవీ చదవండి: