కర్నూలు జిల్లా సంజామల తహసీల్దార్ గోవింద్ సింగ్ ఇంట్లో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కర్నూలు నగరంలోని కృష్ణా నగర్లో ఉన్న ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. రూ.2.5 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించి.. తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఏసీబీ కోర్టులో హాజరు పరిచామని డీఎస్పీ తెలిపారు.
తహసీల్దార్ ఇంట్లో అనిశా సోదాలు.. రూ.2.5 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు
అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో కర్నూలు జిల్లా సంజామల తహసీల్దార్ ఇంట్లో అనిశా అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
కోట్లల్లో బయటపడిన ఆస్తులు