ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలీసుల వల్లే అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య' - సీపీఎం మాజీ ఎమ్మెల్యే ఎమ్.ఏ.గఫుర్

పోలీసుల వేధింపుల వల్లే అబ్దల్ సలాం కుటుంబం బలవన్మరణానికి పాల్పడిందని మాజీ ఎమ్మెల్యే ఎమ్.ఏ గఫూర్ ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ఓ కుటుంబాన్ని బలి తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

'Abdul Salam's family
'పోలీసుల వల్లే అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య'

By

Published : Nov 4, 2020, 8:45 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై ప్రభుత్వం స్పందించాలని సీపీఎం మాజీ ఎమ్మెల్యే ఎమ్.ఏ.గఫూర్ కోరారు. ఆటోలో చోరీ జరిగిందని పోలీసులు వేధించడం వల్లే అతను కుటుంబ సభ్యులతో కలిసి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపించారు. సలాం కుటుంబాన్ని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పోలీసుల అడ్డగోలు ధోరణి, ముస్లింలకు జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details