కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం కేసులో అరెస్ట్ అయిన... సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌ల బెయిల్ పిటిషన్ రద్దుపై విచారణ జరిగింది. సీఐ, హెడ్ కానిస్టేబుల్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై నంద్యాల మూడో అదనపు జిల్లా కోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణ ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో 306 సెక్షన్ విధించాలంటూ పోలీసులు వేసిన రివిజన్ పిటిషన్‌పైనా విచారణ జరిపిన న్యాయస్థానం... విచారణ 19వ తేదీకి వాయిదా వేసింది.
సలాం ఆత్మహత్య కేసు: బెయిల్ రద్దు పిటిషన్ విచారణ వాయిదా
సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టు అయిన సీఐ, హెడ్ కానిస్టేబుల్ బెయిల్ రద్దుపై నంద్యాలలో మూడో అదనపు జిల్లా కోర్టులో విచారణ జరిగింది. పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం, విచారణ వాయిదా వేసింది.
సలాం ఆత్మహత్య కేసు విచారణ వాయిదా