ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుందు నదిలో ఈతకు వెళ్లి ఉపాధ్యాయుడు మృతి - Teacher drowns in Kundu river

స్నేహితులతో కలిసి సరదాగా నదిలో ఈతకు వెళ్లిన ఉపాధ్యాయుడు ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందాడు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా కోవెలకుంట్ల సమీపంలోని కుందు నదిలో జరిగింది.

A teacher was killed while swimming in the Kunda river
కుందు నదిలో మునిగి టీచర్ మృతి

By

Published : May 21, 2021, 10:07 PM IST

కర్నూలు జిల్లా కోవెలకుంట్లకు చెందిన చక్రవర్తి.. అవుకు మండలం సుంకేసుల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో పాఠశాలకు సెలవు కావడంతో ఇంటి వద్దే ఉంటున్న ఆతను.. ఇవాళ స్నేహితులతో కలిసి సరదాగా కోవెలకుంట్ల సమీపంలోని కుందు నదికి వెళ్లాడు. నదిలో ఈత కొడుతూ చక్రవర్తి మునిగిపోయాడు. వెంట ఉన్న స్నేహితులు కాపాడాలని చూసినా ఫలితం లేకపోయింది. చక్రవర్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు మృతుని బంధువులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న కోవెలకుంట్ల ఎస్సై చంద్రశేఖర్.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details