కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. కడిమెట్లలో వడదెబ్బకు రామక్క (55) అనే మహిళ మృతి చెందింది. పొలంలో పనులు చేస్తుండగా ఎండవేడిమికి కుప్ప కూలిపోయింది. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
కందనాతిలో విద్యుదాఘాతంతో ఉరుకుందమ్మ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇంట్లో బండలు శుభ్రం చేస్తుండగా విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది.