16లక్షలు పట్టివేత - ap latest news
ఎమ్మిగనూరు పోలీసుల తనిఖీల్లో సరైన ఆధారాలు లేని కారణంగా డబ్బును స్వాధీన పర్చుకున్నారు.
16లక్షలు పట్టివేత
కర్నూలు జిల్లా బనవాసి వద్ద వాహన తనిఖీల్లో పోలీసులు 16 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. సరైన ఆధారాలు చూపించి ఆదాయపన్ను శాఖ నుంచి తిరిగిపొందవచ్చని సీఐ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఎన్నికలు సమీస్తున్నందున కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ప్రజలు తమతో తీసుకెళ్లే నగదుకు తగిన పత్రాలు కల్గిఉండాలని సూచించారు.