YSRCP Leaders Illegal Sand Mining :టన్నుల కొద్దీ తవ్వుకో లారీల కొద్దీ తరలించుకో దర్జాగా దోచుకో ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదూ! ఇది ఎక్కడో విన్న మాట కాదు సీఎం జగన్ అనే మాట! ఔను రాష్ట్రంలోని ఏ ఇసుక రేవులో చూసినా ఇలా లారీలు బారులు తీరుతున్నాయి. ప్రొక్లైన్లు మోతమోగిస్తున్నాయి! ఇందులో తప్పేముంది అని అనుమానపడకండి? రాష్ట్రంలో ఎక్కడా ఒక్క ఓపెన్ రీచ్‌లో కూడా ఇసుక తవ్వకాలకు పర్యావరణ అనుమతి లేదు! కేంద్ర పర్యావరణ సంస్థైన రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ-సియా గతేడాది ఏప్రిల్‌లో 110 రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు ఆపేయాలని ఆదేశాలిచ్చింది. ఐనా ఇసుక తవ్వకాలు ఎక్కడా ఆగలేదు. ఎవరూ ఆపలేదు.
Illegal Sand Mining in AP :తాజాగా గత నెలలో రెండు కొత్త గుత్తేదారు సంస్థల పేరిట కొత్త ముఠా ఇసుక వ్యాపారం ఆరంభించింది. వీరికి కూడా పర్యావరణ అనుమతుల్లేవ్. రాష్ట్ర వ్యాప్తంగా 172 రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలకు ఈసీలు ఇవ్వాలంటూ గనులశాఖ గత నెలలో సియాకు దరఖాస్తు చేసింది. కానీ అనుమతులివ్వలేదు. సియా అసలు నిర్ణయమే తీసుకోలేదు. కానీ టిప్పర్లకు టిప్పర్లు దర్జాగా తవ్వేసుకుంటున్నారు. టన్ను ఇసుకకు ప్రభుత్వానికి సీనరేజి కింద 375 రూపాయలు, జీఎస్టీ కింద మరో 24 రూపాయలు చెల్లించాలి. అనధికారిక తవ్వకాలేవీ గనులశాఖ లెక్కల్లోకి రాదు. మరి లారీలకొద్దీ అమ్ముకుంటున్న ఇసుక డబ్బు ఎటెళ్తోంది? ఎవరికి చేరుతోంది? అన్నది బహిరంగ రహస్యమే. నిత్యం సగటున 60 నుంచి 70 వేల టన్నుల ఇసుక తరలిస్తున్నారు. దీని ద్వారా వచ్చే కోట్లాది రూపాయలను వచ్చే ఎన్నికల ఖర్చుకోసం ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తున్నారనే ప్రచారం ఉంది.
కృష్ణా నదిలో తవ్వకో - తరలించుకో - తీనుకో - ఇదీ వైఎస్సార్సీపీ నేతల దోపిడీ తీరు
తెరవెనుక సీఎం సోదరుడు : రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నదుల్లో సాగుతున్న ఇసుక దందా అధికారిక ముద్రతోనే సాగుతోంది. 2021 మే నుంచి గత నెల వరకు జేపీ పవర్ వెంచర్స్ ముసుగులో వైఎస్సార్సీపీ నేతలే ఇసుక తరలించుకుపోయారు! గతనెల నుంచి తెలంగాణకు చెందిన ప్రతిమా ఇన్‌ఫ్రా, రాజస్థాన్‌కు చెందిన GCKCఅనే సంస్థలకు టెండర్లు దక్కినట్లు చూపించారు. కానీ ఆ రెండు కంపెనీల తెరవెనుకుండి ఇసుక వ్యాపారం చేస్తోంది సీఎం జగన్‌కు సోదరుడైన వైఎస్ అనిల్‌రెడ్డి! ఆయన కనుసన్నల్లో సాగుతున్న ఈ దందాను ఆయన ఏపీ ఒకరు ప్రత్యక్షంగా నడిపిస్తుంటారు.