విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో'కంటివెలుగు పథకం'తీరుతెన్నులపై రాష్ట్రస్థాయి కార్యశాలను ఏర్పాటుచేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని హాజరయ్యారు.వచ్చే నెల10నుంచి పథకాన్ని అమలుచేయనున్నట్టు తెలిపారు. 560కోట్లతో అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అధికారులు నిబద్ధతతో పనిచేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఆరు దశల్లో నిర్వహించనున్న కార్యక్రమంలో భాగంగా మొదటి రెండు విడతల్లో పాఠశాల విద్యార్థులకు,తర్వాత నాలుగు దశల్లో అందరికీ విస్తరించనున్నట్టు మంత్రి వివరించారు.
అక్టోబరు 10నుంచి వైఎస్సార్ కంటివెలుగు
అక్టోబర్ 10 నుంచి వైఎస్సార్ కంటివెలుగు పథకంను ప్రతిష్టాత్మకంగా అమలుచేయనున్నట్టు మంత్రి ఆళ్లనాని తెలిపారు.
ఆళ్లనాని