ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Young Woman Commits Suicide: యువతి ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా? - Young Woman Commits Suicide in Krishna district

Young Woman Commits Suicide in Krishna district: కృష్ణా జిల్లా గూడవల్లిలో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న గన్నవరం పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలు ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన కంచర్ల అహల్యగా గుర్తించారు.

Young Woman Commits Suicide
యువతి ఆత్మహత్య

By

Published : Dec 13, 2021, 3:44 AM IST

Young Woman Commits Suicide in Krishna district: కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం గూడవల్లిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న గన్నవరం పోలీసులు.. ఆ యువతి ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన కంచర్ల అహల్య(22)గా గుర్తించారు.

స్థానికంగా ఓ యువకుడితో గత మూడు నెలలుగా సహజీవనం చేస్తోందని స్థానికులు తెలిపారు. ఇరువురి మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details