ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెట్రోలంటూ ఆరెంజ్‌ జ్యూస్‌ పోసుకొని.. కలెక్టరేట్‌లో యువకుడి హల్‌చల్‌

Threatened by Pouring Juice : తన భూ సమస్యను పరిష్కరించకపోతే చనిపోతానంటూ ఒంటిపై పెట్రోలు పోసుకుని ఓ యువకుడు అధికారులను బెదిరించాడు. సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడిని అడ్డుకునే క్రమంలో పెట్రోల్‌ వాసన రాకపోడంతో సీసాను పరిశీలించగా.. అందులో ఆరెంజు జ్యూస్‌ ఉందని గుర్తించారు. ఈ సంఘటన తెలంగాణలోని హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో చోటుచేసుకుంది.

Threatened
కలెక్టరేట్‌లో యువకుడి హల్‌చల్‌

By

Published : Feb 7, 2023, 12:23 PM IST

Threatened by Pouring Juice : పెట్రోలంటూ ఆరెంజ్‌ జ్యూస్‌ ఒంటిపై పోసుకొని ఓ యువకుడు అధికారులను బెదిరించాడు. ఈ ఘటన సోమవారం తెలంగాణలోని హనుమకొండ కలెక్టరేట్‌లో జరిగింది. వివరాల్లోకెళ్తే.. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి జరిగింది. హనుమకొండ జిల్లా భీమధేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన అజయ్‌రెడ్డి వచ్చాడు.

తన భూ సమస్యను అధికారులు పరిష్కరించడం లేదని, పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానంటూ సీసాలోని ఆరెంజ్‌ రసాన్ని ఒంటిపై పోసుకున్నాడు. సెక్యురిటీ సిబ్బంది సదరు యువకుడిని అడ్డుకున్నారు. పెట్రోల్‌ వాసన రాకపోడంతో సీసాను పరిశీలించగా.. అందులో ఆరెంజు జ్యూస్‌ ఉందని గుర్తించారు. కలెక్టరేట్‌ ఏవో కిరణ్‌ప్రకాశ్‌ వచ్చి యువకుడితో మాట్లాడగా.. కాస్తులో ఉన్న భూమికి పట్టా లేదని, స్థానిక అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కావడం లేదని చెప్పాడు. భూసమస్యకు కలెక్టర్‌ పరిష్కారమార్గం చూపించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details