విరాళాల సేకరణలో వైకాపా దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో మూడో స్థానంలో నిలిచింది. 2017-18 సంవత్సరాల్లో ఆ పార్టీకి 8 కోట్ల 35 లక్షలు వచ్చాయి. 3 కోట్ల 30 లక్షలతో తెరాస ఐదోస్థానంలో, కోటి 73 లక్షలతో తెదేపా ఏడో స్థానంలో ఉన్నాయి.
ముందు సంవత్సరం వచ్చిన నిధులతో పోల్చి చూసినప్పుడు వైకాపా విరాళాల్లో 95 శాతం పెరుగుదల, తెరాస విరాళాల్లో 90 శాతం, కనిపించింది. బిజూ జనతాదళ్ 13 కోట్ల 4 లక్షలతో మొదచి స్థానంలో నిలిచింది. కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించిన నివేదికల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమెుక్రాటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ అధ్యయనం చేసింది. వివిధ పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను ప్రకటించింది.
వివిధ పార్టీలకు వచ్చిన విరళాలు
బిజూ జనతాదళ్ | 13.04 కోట్లు |
జనతాదళ్( యూ) | 11.19 కోట్లు |
వైకాపా | 8.35 కోట్లు |
ఆమ్ ఆద్మీ పార్టీ | 8.32 కోట్లు |
తెరాస | 3.30 కోట్లు |
అకాలీదళ్ | 2.28 కోట్లు |
తెదేపా | 1.73 కోట్లు |
డీఎంకే | 1.26 కోట్లు |