ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'56 వేల పడకలు ఎక్కడున్నాయో సీఎం జగన్ చెప్పాలి' - beds in covid hospitals in ap

కొవిడ్ ఆసుపత్రుల్లో పడకల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. మరోవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచలేదని మండిపడ్డారు.

ayyanna
ayyanna

By

Published : Aug 22, 2020, 3:49 PM IST

రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో 56 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి చెబుతున్నారని... అవి ఎక్కడున్నాయో ఆయనే కరోనా రోగులకు చెప్పాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. పడకలు లేనప్పుడు ఉన్నాయని ముఖ్యమంత్రి అవాస్తవాలు చెప్పడం తగదన్నారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం సరికాదని వ్యాఖ్యానించారు.

మరోవైపు.. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై... రైతులు పంటలు వేసినా ఎరువులు అందుబాటులో లేవని అయ్యన్న ఆగ్రహించారు. రైతులకు ఎప్పుడు ఏది కావాలో ప్రభుత్వం గుర్తించడం లేదని మండిపడ్డారు. అలాగే ఉద్యాన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details