కృష్ణాజిల్లా గన్నవరంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌ను కలవడం పట్ల... గన్నవరం నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల సమయంలో తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన వంశీని... వైకాపాలో ఎలా చేర్చుకుంటారని యార్లగడ్డ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడలోని టీచర్స్ కాలనీలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు నివాసానికి పెద్దఎత్తున కార్యకర్తలు చేరారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
వల్లభనేని రాక..! వైకాపాలో మొదలైన కాక.. - vallabaneni vamshi latest updates
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ... సీఎం జగన్‌ను కలవడం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వంశీని పార్టీలోకి ఎలా తీసుకుంటారంటూ యార్లగడ్డ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ycp-cader-meeting-in-vijayawada