ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డబ్బులివ్వలేదని.. అత్తపై వేడివేడి నూనె పోసిన కోడలు! - కృష్ణా జిల్లాలో అత్తపై వేడి నూనె పోసిన కోడలు

కృష్ణా జిల్లాలో అమానుష ఘటన జరిగింది. డబ్బులివ్వలేదని అత్తపై కోడలు హత్యాయత్నానికి పాల్పడింది. కాగుతున్న నూనెను అత్తపై పోసింది. తీవ్ర గాయాలపాలైన ఆమె.. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

women pour heat oil gudiwada
women pour heat oil gudiwada

By

Published : Jun 27, 2021, 11:05 AM IST

Updated : Jun 27, 2021, 12:20 PM IST

డబ్బులివ్వలేదని.. అత్తపై వేడివేడి నూనె పోసిన కోడలు!

కృష్ణా జిల్లా గుడివాడలో దారుణం జరిగింది. డబ్బులు ఇవ్వలేదని అత్తపై కోడలు వేడి నూనెతో పోసింది. పట్టణంలోని మందపాడులో చుక్కా లక్ష్మి.. తన కుమారుడైన చుక్కా శివనారాయణ, కోడలు స్వరూపతో కలిసి ఉంటోంది. లక్ష్మి వద్ద కొంత నగదు ఉంది. దాన్ని ఇవ్వాలని కోడలు ఆమెను పదే పదే అడుగుతున్నా.. అత్త ఇవ్వట్లేదు. ఆగ్రహానికి గురైన కోడలు ఇంట్లో నిద్రిస్తున్న అత్తపై వేడి వేడి నూనె పోసి హత్యాయత్నానికి పాల్పడింది.

తీవ్ర గాయాలపాలైన లక్ష్మి.. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న గుడివాడ టూ టౌన్ పోలీసులు కుమారుడు శివ నారాయణ, కోడలు స్వరూపను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వృద్ధురాలైన అత్తపై, కోడలు చేసిన దుశ్చర్యపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Jun 27, 2021, 12:20 PM IST

ABOUT THE AUTHOR

...view details