ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సామాజిక దూరంతోనే కరోనా నియంత్రణ'

కృష్ణా జిల్లా నందిగామ, జగ్గయ్యపేటలో కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా పలువురు రాజకీయ నేతలు భాగస్వాములవుతున్నారు. సామాజిక దూరంతోనే కరోనాను దూరం చేయవచ్చని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జగ్గయ్యపేటలో హైడ్రో క్లోరిన్​ను రోడ్లపై పిచికారి చేశారు.

whip and ex mla seperately creates awareness about corona at vijayawada
విజయవాడలో కరోనాపై అవగాహన కార్యక్రమం

By

Published : Mar 30, 2020, 3:44 PM IST

విజయవాడలో కరోనాపై అవగాహన కార్యక్రమం

సామాజిక దూరంతోనే కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. నందిగామ పట్టణ మార్కెట్ యార్డు, సీఎం రోడ్డు, డీవీఆర్ కాలనీలను సౌమ్య సందర్శించారు. నిత్యావసరాల కోసం బయటకు వచ్చిన ప్రజలతో మాట్లాడి... అందరూ లాక్​డౌన్​ పాటించాలని తెలిపారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి విరివిగా చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం శానిటైజర్లను రాయితీ ధరల్లో ప్రజలకు అందజేయాలని కోరారు.

జగ్గయ్యపేటలో...

జగ్గయ్యపేట పట్టణంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రత్యేక యంత్రాలతో బ్లీచింగ్, హైడ్రో క్లోరిన్​ను రోడ్లపై పిచికారీ చేశారు. ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో ప్యారామౌంట్ సంస్థ వితరణతో ఈ కార్యక్రమం చేపట్టారు.

ఇదీ చదవండి:

కాటికి వెళ్తారా... ఇళ్లల్లో ఉంటారా...??

ABOUT THE AUTHOR

...view details