ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎస్సై ఆత్మహత్యపై దేవినేని ఉమా వ్యాఖ్యలు ఖండిస్తున్నాం' - Gudivada Two Town si Vijay Kumar Suicide news

వ్యక్తిగత కారణాల వల్లే కృష్ణా జిల్లా గుడివాడలోని టూ టౌన్ ఎస్సై విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లు డీఎస్పీ సత్యానందం తెలిపారు. విజయ్​ బలవర్మణానికి పాల్పడటం చాలా బాధాకరమని అన్నారు.

dsp satyanandam
మాట్లాడుతున్న డీఎస్పీ సత్యానందం

By

Published : Jan 21, 2021, 1:38 PM IST

కృష్ణా జిల్లా గుడివాడ టూ టౌన్ ఎస్సై విజయ్ కుమార్.. వ్యక్తిగత కారణాల వల్లే ఆత్మహత్య చేసుకున్నారని డీఎస్పీ సత్యానందం స్పష్టం చేశారు. కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. పేకాట దాడుల నిర్వహణలో ఒత్తిడులకు తట్టుకోలేకే ఎస్సై బలవన్మరణానికి పాల్పడ్డారంటూ.. మాజీ మంత్రి దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు.

కారణాలు తెలుసుకోకుండా దేవినేని చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని డీఎస్పీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తీరును పోలీసు శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఆయన చేసిన ఆరోపణలపై ఆధారాలు చూపించాలని నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం పోలీసులను వాడుకోవద్దని కోరారు.

ABOUT THE AUTHOR

...view details