'పదవులు ముఖ్యం కాదెప్పుడూ ' - balayogi death day
లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్థంతి సందర్భంగా రాజధానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకి నివాళి అర్పించారు. ఒక దళితుణ్ని లోక్సభ స్పీకర్గా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని వ్యాఖ్యానించారు. ఆనాడు 8మంత్రి పదవులు ఇవ్వటానికి అప్పటి ప్రధాని వాజ్పేయి సిద్ధపడినా వాటిని కాదని సభాపతి పదవి మాత్రమే తీసుకున్నట్టు గుర్తు చేశారు.
లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్థంతి సందర్భంగా రాజధానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకి నివాళి అర్పించారు. ఏపీలో ఒక దళితుడిని లోక్సభ స్పీకర్గా చేసిన ఘనత తెదేపా ప్రభుత్వానిదేనని సీఎం తెలిపారు. ఆనాడు కేంద్రంలో 8 మంత్రి పదవులు ఇవ్వటానికి అప్పటి ప్రధాని వాజ్పేయి సిద్ధపడ్డారు. తమపదవులు ముఖ్యం కాదని ఆయనకు చెప్పామన్నారు. భాజపా ఒత్తిడితోనే రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని తీసుకున్నామని పేర్కొన్నారు. లోక్సభ స్పీకరుగా ఉండి బాలయోగి రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఎంపీగా, రాష్ట్రమంత్రిగా, లోక్సభ స్పీకర్గా ఆయన సేవలు ఎనలేనివని, రాష్ట్రప్రజలకు జీఎంసీ బాలయోగి కలకాలం గుర్తుంటారని అభిప్రాయపడ్డారు. .