ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలుషిత జలమే శరణ్యమా? - కృష్ణాజిల్లా వార్తలు

మంచినీటి చెరువుల్లో పుష్కలంగా నీరు ఉన్నా తాగేందుకు ఉపయోగపడక పోవడంతో..పల్లెల్లో తాగునీటికి ప్రజల అవస్థలు పడుతున్నారు. వర్షాకాలంలోనూ గొంతెండుతోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఊటబావిలో నీటిని తోడుతున్న గ్రామస్థులు
ఊటబావిలో నీటిని తోడుతున్న గ్రామస్థులు

By

Published : Oct 1, 2020, 2:05 PM IST

ఊటబావిలో నీటిని తోడుతున్న గ్రామస్థులు

మంచినీటి చెరువుల్లో పుష్కలంగా నీరు ఉన్నా తాగేందుకు ఉపయోగపడక పోవడంతో..పల్లెల్లో తాగునీటికి ప్రజల అవస్థలు పడుతున్నారు. వర్షాకాలంలోనూ గొంతెండుతోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా అధికారుల తీరు మారనందున గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత నీటి పథకాల ద్వారా తాగునీరు సరఫరా కలగానే మిగులుతోంది. క్లోరినేషన్‌ చేసిన శుద్ధ జలం అందించలేని దయనీయ పరిస్థితుల్లో గ్రామాలు ఉన్నాయి.

ప్రస్తుతం పంట కాలువలు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి.. వర్షాలు సైతం అధికంగా పడుతుండటంతో ఈ నీరు కలుషితమవుతోంది. నెలకు రెండుసార్లు ట్యాంకులను శుభ్రపరచి ఫిల్టర్‌ బెడ్లు మరమ్మతులు నిర్వహించాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తోంది. ఆర్థిక సంఘం నిధులు అందుబాటులో ఉన్నా అధికారులు సమస్యను పరిష్కరించకపోవడంతో కుళాయిల్లో మురుగు నీరే దిక్కవుతోంది. గృహావసరాలకు సైతం నీరు ఉపయోగపడటం లేదని.. స్నానం చేస్తున్నా చర్మవ్యాధుల బారిన పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు.

ఊటబావులే దిక్కు

రక్షిత నీటి పథకాల నుంచి తాగునీరు అందక గ్రామాల్లో ఉన్న ఊటబావుల పైనే ప్రజలు ఆధారపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీటిపై పంచాయతీల పర్యవేక్షణ కొరవడింది. ప్రజావసరాలకు ఉపయోగపడుతున్నా క్లోరినేషన్‌ లేక నీరు కలుషితమై బావులు నాచుపట్టి ఆధ్వానంగా మారుతున్నాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రజలు ఆ నీటినే తాగుతున్నారు. మరికొందరు అనధికారక శుద్ధజల కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అధికారులు దృష్టి సారిస్తే గ్రామాల్లో తాగునీరు అందించడం సమస్యే కాదనేది గ్రామస్థుల వాదన. మండలంలోని తామరకొల్లు, వింజరం, ఆచవరం, రాచపట్నం, సీతనపల్లి, దొడ్డిపట్ల్ల, రామవరం, గోనిపాడులో ఊటబావుల నీరే దిక్కు అవుతుండంగా వాటి సంరక్షణకైనా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సంపుల్లో నాచుపట్టిన నీరు

తాగునీరు సరఫరా చేస్తాం

మండలంలోని రక్షిత మంచినీటి పథకాల నుంచి తాగునీరు అందించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో 14వ ఆర్థిక సంఘం నిధులతో ఫిల్టర్‌ బెడ్ల మరమ్మతులు జరుగుతున్నాయి. దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. తామరకొల్లు, వింజరం, రామవరంలో పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి ట్యాంకుల ద్వారా శుభ్రమైన నీరు సరఫరా చేసేలా చూస్తాం. - శాస్త్రి ,ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈఈ, కైకలూరు

ఇదీ చదవండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఇవే

ABOUT THE AUTHOR

...view details