ప్రమోషన్ల అంశంపై ఏపీజేఏసీ ఛైర్మన్ బొప్పరాజు చేసిన ప్రకటనను ఖండిస్తున్నామని విజయవాడ ఏపీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్వోల అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ అన్నారు. విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన... 86 శాతం ఉన్న వీఆర్వోలకు యాభై శాతమే పదోన్నతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లుగా బొప్పరాజు ప్రకటనలు చేయడం సరికాదన్నారు. సీనియర్ అసిస్టెంట్ గా 86 శాతం వీఆర్వోలకు, 14 శాతం జూనియర్ అసిస్టెంట్ లకు ప్రమోషన్ లు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం కూడా అంగీకరించి 132జీఓ ఇచ్చిందని, దీనికి ఆటంకాలు కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
ప్రమోషన్లకు ఆటంకాలు కలిగిస్తే ఊరుకోం: ప్రసన్న కుమార్ - ఏపీజేఏసీ ఛైర్మన్ బొప్పరాజు
వీఆర్వోల పదోన్నతి అంశంలో బొప్పరాజు చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్లు వీఆర్వోల అసోసియేషన్ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమోషన్ల అంశానికి ఆటంకాలు కలిగిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
ప్రమోషన్లకు ఆటంకాలు కలిగిస్తే ఊరుకోం : ప్రసన్న కుమార్