వీఓఏల తొలగింపు నిలిపివేయాలని ఆందోళన
వెలుగు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఛలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టారు. వీఓఏల తొలగింపు నిలిపివేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు. పొదుపు సంఘాల పనిని గ్రామ వాలంటీర్లకు అప్పగించొద్దని కోరారు.
voa-employees-chalo-vijayawada-program
వీఓఏల తొలగింపు, వేధింపులు తక్షణమే ఆపాలని కోరుతూ వెలుగు ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు 'ఛలో విజయవాడ' నిర్వహించారు. ఈ కార్యక్రమానికిఉద్యోగులు భారీగా తరలివచ్చారు. సెర్ప్ వెలుగు యానిమేటర్లు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. 10 వేల రూపాయల నెలవారీ వేతనంతోపాటు... బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పొదుపు సంఘాల పని గ్రామ వాలంటీర్లకు అప్పగించొద్దని కోరారు.