ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమ్మో పాములొస్తాయేమో.. రోడ్డుపై పడుకుందాం - పాముల భయంతో రోడ్డుపై పడుకుంటున్న గ్రామస్థులు న్యూస్

పాముల భయంతో రోడ్డుపై నిద్రపోతున్నారు కొంతమంది. విద్యుత్ సౌకర్యం లేక.. రేషన్ దుకాణాల్లో కిరోసిన్ అందక.. గుడిసెల్లోకి పాములొస్తున్నాయని భయంతో బతుకుతున్నారు.

villagers sleep on roads because fear of snakes in krishna district
villagers sleep on roads because fear of snakes in krishna district

By

Published : Jul 29, 2020, 8:07 PM IST

కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కోసూరువారిపాలెం గ్రామం ప్రారంభంలో పంట కాలువ గట్టుపై యాభై ఏళ్లుగా.. చిన్న చిన్న గుడిసెలు వేసుకుని కొంతమంది జీవనం సాగిస్తున్నారు. గతంలో కిరోసిన్ ఇచ్చినప్పుడు దీపాన్ని వెలిగించుకునేవారు. దానితో విషపురుగులు వచ్చేవి కావు. ప్రస్తుతం చౌక ధరల దుకాణాల ద్వారా కిరోసిన్ ఇవ్వకపోవడంతో వీరికి సమస్య వచ్చి పడింది. ప్రభుత్వం అందించే విద్యుత్ సౌకర్యం వీరి వరకు చేరలేదు. ప్రస్తుతం.. వర్షాలు ఎక్కువగా పడటం వలన ప్రతి రోజు రాత్రి సమయంలో పదుల సంఖ్యలో పాములు గుడిసెల్లోకి వస్తున్నాయి. గట్టుపై నివసించే వారంతా.. ప్రాణ భయంతో పక్కనే ఉన్న రోడ్డుపైకి వచ్చి నిద్రపోతున్నారు. రోడ్డుపై వెళ్లే వాహనాలతో ప్రమాదం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. తమ గుడిసెల దగ్గర వీధి లైట్లు అయినా ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details