ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమరాంధ్ర-2019: బెజవాడ గడ్డ ఎవరికి అడ్డా? - తెదేపా

బెజవాడ రాజకీయ చదరంగంలో రాణించేదెవరు..?పారిశ్రామికవేత్తల పరుగులో ఎవరి పంతం నెగ్గనుంది? తెదేపా తరపున 2వసారి బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ కేశినేనిని...వైకాపా అభ్యర్థి ఢీ కొట్టగలరా.?అనూహ్య పరిణామాల మధ్య సీటు దక్కించుకున్న పొట్లూరి పవర్ ఎంత..? కృష్ణ జిల్లాలో హాట్ సీటుగా మారిన విజయవాడ పార్లమెంట్ స్థానంపై ప్రత్యేక కథనం.

బెజవాడ రంగస్థలంలో రాజేవరు?

By

Published : Apr 4, 2019, 9:35 AM IST

Updated : Apr 4, 2019, 12:38 PM IST

సమరాంధ్ర-2019: బెజవాడ గడ్డ ఎవరికి అడ్డా?
రాజకీయాల అడ్డా బెజవాడ లోక్​సభ స్థానంలో సమీకరణాలు మారుతున్నాయి. మాటాల తుటాలు పేల్చుతూ అభ్యర్థులు కాక పుట్టిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ కేశినాని మరోసారి బరిలోకి దిగి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆలస్యంగా నియోజకవర్గంలో అడుగుపెట్టిన వైకాపా అభ్యర్థి పొట్లూరి వీరప్రసాద్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. గెలుపు మాదంటే మాదంటూ తెదేపా-వైకాపాలు ముందుకుసాగుతుండగా...మనుగడ కోసం కాంగ్రెస్, భాజపా, జనసేనలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి.అభివృద్ధి..అసెంబ్లీ అభ్యర్థులే బలం...
బలమైన ఆర్థిక మూలాలున్న ఇద్దరు వ్యక్తులు విజయవాడ స్థానం నుంచి ఈసారి బరిలోకి దిగి పోరును ఆసక్తికరంగా మార్చారు. 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్‌పై 74 వేలపై చిలుకు ఓట్ల తేడాతో గెలిచిన నాని... ఈసారి మళ్లీ విజయాన్ని అందుకునేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో తెదేపా ఎమ్మెల్యేలు బలంగా ఉండటం ఆయకు కలిసోచ్చే అంశం. గ్రామీణ ప్రాంతంలో నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరులపై దృష్టిసారించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు ముఖ్యమంత్రి సహాయనిధి ఆయనకు బాగా కలిసి వచ్చేలా కనిపిస్తోంది.
అనూహ్యంగా వైకాపా అభ్యర్థి పొట్లూరి..
వైకాపా తరపున బరిలో ఉన్న పొట్లూరి వీరప్రసాద్ ఆర్థికంగా బలమైన వ్యక్తే. నిజానికి 2014 ఎన్నికల్లో తెదేపా తరపున టిక్కెట్ కోసం ప్రయత్నించారు. కానీ 2013లోనే చంద్రబాబు పాదయాత్ర చేసిన సమయంలో కేశినేని నాని పార్టీలో చేరారు. నాడే ఆయనకు టిక్కెట్‌పై హామీ ఇచ్చి ఉన్నందున పీవీపీకి అవకాశం దక్కలేదు. అప్పటికే వైకాపా తరపున కోనేరు రాజేంద్రప్రసాద్ బరిలోకి దిగారు. ఈసారి ఆయనికి టికెట్‌ దక్కలేదు. ఆయన స్థానంలో తొలుత దాసరి జైరమేష్‌ పేరు పరిశీలనకు వచ్చింది. అనూహ్యంగా ఆఖరి నిమిషంలో పీవీపీ పేరు తెరపైకి వచ్చింది. 7 నియోజకవర్గాల్లో కేవలం తిరువూరు మాత్రమే వైకాపా చేతిలో ఉంది. జలీల్ ఖాన్​, వంగవీటి రాధా వంటి వారు తెదేపాలోకి చేరిక వైకాపాను ఇబ్బంది పెట్టే అంశంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకత..జగన్​ పై ఉన్న ప్రజాధరణతో గెలుస్తామనే ధీమా వైకాపాలో ఉంది. ఈసారి విజయవాడ పార్లమెంట్ పరిధిలో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవటం ఖాయమంటున్నారు ఆ పార్టీ నేతలు.
ప్రధాన పార్టీల మధ్య పోటీ..
ఇక మిగతా పార్టీల నుంచి పోటీ నామామాత్రమే. ప్రధాన పోటీ తెదేపా-వైకాపాల మధ్య నువ్వా-నేనా అన్నట్లు ఉంది. జనసేన నుంచి ముత్తంశెట్టి సుధాకార్ బరిలో ఉన్నారు. ఆయన ఏ మేరకు ప్రభావం చూపుతారనేది చూడాలి. కాంగ్రెస్, భాజపాలపోటీ నామామాత్రమేం.
ఐదేళ్ల చేసిన అభివృద్ధినిపైనే ఆశలు పెట్టుకున్న తెదేపా ఒకవైపు ఉంటే...మరోవైపు నవరత్నాలతో ముందుకెళ్తోంది వైకాపా. ఇరు పార్టీల నుంచి ఇద్దరు బలమైన వ్యక్తులు బరిలోకి దిగటంతో బెజవాడ రాజకీయంలో ఎవరూ నెగ్గుతారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.
Last Updated : Apr 4, 2019, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details