ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదల ఇళ్లు తొలగించవద్దు: సీపీఎం - కృష్ణా కరకట్ట వాసుల ఇళ్ల సమస్య

కృష్ణా కరకట్ట వద్ద ఉన్న పేదల ఇళ్లు తొలగించవద్దని కోరుతూ... సీపీఎం నాయకులు ఆందోళన నిర్వహించారు. తక్షణమే రక్షణ గోడ నిర్మించాలని విన్నవించారు. అలాగే వరదలో ఇళ్లు మునిగి నష్టపోయిన బాధితులకు సహాయం అందించాలన్నారు.

CPM leaders raised concerns
సీపీఎం నాయకులు ఆందోళన

By

Published : Oct 29, 2020, 4:58 PM IST

విజయవాడ కృష్ణలంక తారకరామా నగర్లో కృష్ణా కరకట్ట వాసుల ఇళ్లు తొలగించవద్దని కోరుతూ... సీపీఎం నాయకుల ఆందోళన చేపట్టారు. తక్షణమే రక్షణ గోడ నిర్మించాలని సీపీఎం నేత బాబూరావు డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న వైకాపా కరకట్ట వాసుల ఇళ్లు తొలగించవద్దని ఆందోళనలు చేసిందని... నేడు అధికారంలోకి రాగానే ఇలా మాట మార్చడం మోసపూరితం అని విమర్శించారు. ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే ప్రజా ఉద్యమం తప్పదనీ... సీపీఎం నేతలు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details