సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు: విజయవాడ సీపీ - విజయవాడలో పంచాయతీ ఎన్నికలు
విజయవాడ పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో కట్టుదిటమైన ఏర్పాట్లు చేశామని సీపీ బి. శ్రీనివాసులు చెప్పారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. కమిషనరేట్ పరిధిలో జరిగే ఎన్నికలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద ఐదు నుంచి ఆరుగురు సిబ్బంది ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీ జరగకుండా ఉండేందుకు నిఘా ఏర్పాటు చేశామని చెబుతున్న విజయవాడ సీపీ బి.శ్రీనివాసులుతో మాప్రతినిధి ముఖాముఖి.
vijayawada cp srinivasulu on election arrangements
.