కృష్ణాజిల్లా నూజివీడు త్రిబుల్ ఐటీకి రేపు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రానున్నారని ఐటీ డైరెక్టర్ ఆచార్య డి. సూర్యచంద్రరావు తెలిపారు. ఉపకులపతి వి. రామచంద్రరాజు ఆహ్వానం మేరకు ఉపరాష్ట్రపతి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. ఆయన ప్రసంగం తమ విద్యార్థుల్లో స్ఫూర్తి కలిగిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి దమయంతి, జిల్లా కలెక్టర్ మహమ్మద్, ఉపకులపతి రామచంద్రరాజు శ్రీకాకుళం, ఇడుపులపాయ, ఒంగోలు, త్రిబుల్ ఐటీల డైరెక్టర్లు హాజరవుతారని తెలిపారు.
ఇవీ చదవండి..