వైకాపా నుంచి బయటికొచ్చిన వంగవీటి రాధా.. కొంతకాలంగా తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిన్న అర్ధరాత్రి ముఖ్యమంత్రిని ఆయన అధికార నివాసంలో కలిశారు రాధా.సమావేశానికి కేంద్ర మాజీ మంత్రిసుజనా చౌదరి, మాజీ ఎంపీ లగడపాటి హజరయ్యారు. ఈ పరిణామంతో.. వంగవీటి రాధా త్వరలోనే తెలుగుదేశంలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. రాధ సేవలు ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై తెదేపాలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
సైకిలెక్కడానికి సిద్ధంగా వంగవీటి! - vangaveeti on tdp
వైకాపా నుంచి బయటకొచ్చిన వంగవీటి రాధా... తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిన్న అర్ధరాత్రి సీఎం నివాసంలో చంద్రబాబుతో సుజనా, లగడపాటి, వంగవీటి రాధ భేటీ అయ్యారు. రాధా త్వరలోనే తెలుగుదేశంలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది.
కొన్నాళ్ల కిందట రాధా వైకాపాకు రాజీనామా చేసిన సందర్భంలో...తెదేపాలోకే వస్తారని ప్రచారాలు జరిగాయి.ఓ దశలో రాధా చేరికపై ముఖ్యమంత్రిపార్టీ నేతలకు సూచనలు చేశారు. అందరూ కలిసి పనిచేయాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయినా... రాధా మాత్రం ఇన్నాళ్లూ తటస్థంగానే ఉన్నారు. ఈ సమయంలో.. మళ్లీ ఆయన్ను వైకాపాలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలూ ప్రయత్నించినట్టు వార్తలొచ్చాయి. ఈ ఊహాగానాలకు తెరదించుతున్నట్టుగా... ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాధా సమావేశమయ్యారు. 2 గంటల పాటు తన రాజకీయ భవిష్యత్తుపై చర్చించారు.