ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై పోరాడతా: వల్లభనేని - వల్లభనేని వంశీ

తెదేపాను నమ్మి మరోసారి గెలిపించినందుకు గన్నవరం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు. ఈ సారి నియోజకవర్గంలో కేవలం మెజార్టీ మాత్రమే తగ్గింది. ఓటింగ్ శాతం గత ఎన్నికల కంటే ఎక్కువగా నమోదైంది. పార్టీ శ్రేణులు నిరాశ చెందనవసరం లేదు. కొన్ని పనులు పెండింగ్​లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది- వల్లభనేని వంశీ, గన్నవరం ఎమ్మెల్యే

తెదేపాను మరోసారి నమ్మినందుకు కృతజ్ఞతలు:గన్నవరం ఎమ్మెల్యే

By

Published : May 25, 2019, 6:01 AM IST

తెదేపాను మరోసారి నమ్మినందుకు కృతజ్ఞతలు:గన్నవరం ఎమ్మెల్యే

కృష్ణా జిల్లా గన్నవరంలో తెదేపాను మరోసారి గెలిపించినందుకు..నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ కృతజ్ఞతలు తెలిపారు. పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానుభావులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో రెండోసారి విజయం సాధించటం తనకు గర్వకారణంగా ఉందన్నారు. గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గం అభివృద్ధికి చిత్తుశుద్ధితో పనిచేశానన్నారు. తెదేపా అధికారంలో లేకపోయినా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని వంశీ గన్నవరంలో స్పష్టం చేశారు.
ఇవీ చూడండి-జాతీయ పార్టీలు లేని తొలి శాసనసభ ఇదే...

ABOUT THE AUTHOR

...view details