ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలికపై అత్యాచారం.. పరిస్థితి విషమం - నూజివీడులో బాలికపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారం

మూడో తరగతి చదువుతున్న ఓ బాలిక... తన తండ్రి కోసం ఇంటి బయట ఎదురుచూస్తూ కూర్చుంది. రాత్రయినా నాన్న రాకపోయేసరికి తనే రోడ్డు మీదకి వెళ్లింది. గమనించిన ఓ ఆగంతుకుడు.. ఆమె తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలుసంటూ బాలికను తనతో తీసుకెళ్లాడు. అత్యాచారం చేసి.. అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. హృదయ విదారకమైన ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.

unknown person rape a girl in nuzvid
బాలికపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారం

By

Published : Feb 27, 2020, 11:27 AM IST

Updated : Feb 27, 2020, 11:34 AM IST

బాలికపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారం

కృష్ణా జిల్లా నూజివీడులో ఓ చిన్నారిపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో తన తండ్రి కోసం ఇంటికి సమీపంలోని రోడ్డుపై నిలుచున్న మూడో తరగతి బాలికను ఆగంతుకుడు సైకిల్‌ పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. అత్యాచారం చేశాడు. అనంతరం సంఘటనా స్థలంలోనే బాలికను వదిలేసి పరారయ్యాడు. భరించలేని బాధతో బాలిక వేసిన కేకలు విన్న పెట్రోలింగ్ పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.

Last Updated : Feb 27, 2020, 11:34 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details