భయపెట్టి బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన సంఘటన నెల తర్వాత ఆలస్యంగా కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో వెలుగుచూసింది. ఈ తతంగాన్ని నిందితుడు తన సెల్‌లో వీడియో, ఫొటోలు తీశాడు. బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక విషయాన్ని కుటుంబీకులకు ఆలస్యంగా చెప్పింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. మచిలీపట్నానికి చెందిన 17 ఏళ్ల బాలిక నెల కిందట రాత్రి తన ఇంటికి వస్తుండగా.. బైక్‌పై ఇద్దరు వచ్చి ఓ చిరునామా గురించి ఆరా తీశారు. తాము పోలీసులమంటూ తమతో రావాలని బెదిరించి ద్విచక్రవాహనంపై బలవంతంగా ఎక్కించుకుని చిలకలపూడి రైల్వేస్టేషన్ వెనకనున్న నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ బాలికపై అత్యాచారం చేశారు. విషయాన్ని ఇంట్లో చెబితే తాము చిత్రించిన వీడియోలను బయటపెడతామని, చంపేస్తామని బెదిరించారు. బాలిక సెల్‌ఫోన్‌నూ లాక్కున్నారు. బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. శనివారం సాయంత్రం బాలిక ఇంటి బయట ఉండగా మళ్లీ బైక్‌పై గతంలో తీసుకువెళ్లిన గుర్తు తెలియని వ్యక్తుల్లో ఒకరు తారసపడ్డాడు. అతడిని గుర్తుపట్టి ఇంట్లో వారికి తెలిపింది. వారు బైక్‌పై ఉన్న నగరంలోని సుకర్లాబాద్ ప్రాంతానికి చెందిన నారాయణను పట్టుకుని చితకబాది మచిలీపట్నం స్టేషన్‌లో అప్పగించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
బాలికను కిడ్నాప్ చేసి ఇద్దరు యువకుల అత్యాచారం - ఏపీ తాజా వార్తలు
ఓ బాలికను అపహరించి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మచిలీపట్నంలో ఆలస్యంగా వెలుగుచూసింది. నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై తాజాగా కేసు నమోదు అయ్యింది. అత్యాచారం చేసిన నిందితుల్లో ఒకరు బాలిక ఇంటి ముందు సంచరిస్తుండటంతో.. గుర్తించిన బాలిక, తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
రెండో వ్యక్తి ప్రమేయంపై దర్యాప్తు:అత్యాచార సంఘటనకు సంబంధించి మరొకరిని అదుపులోకి తీసుకోవాలని బాధితురాలి బంధువులు స్టేషన్ వద్ద డిమాండ్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు మాత్రం ప్రాథమిక దర్యాప్తులో తానొక్కడినే బాలికను భయపెట్టి తీసుకెళ్లినట్టు చెబుతున్నాడు. బాధితురాలు మాత్రం తనను ఇద్దరు తీసుకెళ్లారని చెబుతోంది. నిందితుడినుంచి అతడి ఫోన్‌తోపాటు బాలిక ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని ఆధారాల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడి ఫోన్‌కు సంబంధించి సంఘటన జరిగిన రోజు కాల్‌డేటా, సెల్‌టవర్ లొకేషన్ వివరాలను తెప్పించి విశ్లేషిస్తున్నారు. నారాయణతోపాటు మరొకరు ఇందులో పాల్గొన్నాడా? లేదా అన్నది పరిశీలిస్తున్నారు. బాధితురాలు మైనర్ కావడం, కేసు తీవ్రత దృష్ట్యా మచిలీపట్నం పీఎస్ నుంచి దీనిని దిశ పోలీసుస్టేషన్‌కు జిల్లా ఎస్పీ జాషువా బదిలీ చేశారు. సోమవారం నిందితుడి అరెస్టు చూపించే అవకాశం ఉంది.