విజయవాడ రూరల్ మండలం గూడవల్లి వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటో ఎదురుగా వస్తున్న లారీ కిందకి దూసుకెళ్లింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గన్నవరం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని..దర్యాప్తు చేస్తున్నారు.
ACCIDENT: గూడవల్లి వద్ద లారీ కిందకు దూసుకెళ్లిన ఆటో..ఇద్దరు మృతి - కృష్ణాజిల్లాలో రోడ్డు ప్రమాదం
లారీ కిందకు దూసుకెళ్లిన ఆటో..ఇద్దరు మృతి
14:00 August 14
మరొకరి పరిస్థితి విషమం
Last Updated : Aug 14, 2021, 2:22 PM IST