తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రామచంద్రాపురం పంచాయతీ పరిధిలో ఓ గర్భిణి అంబులెన్స్‌లోనే కవల పిల్లలకు జన్మనిచ్చింది. సింగారానికి చెందిన బొర్ర కుమారి.. ప్రసవ వేదనతో బాధపడింది.
ఆమెను 108 వాహనంలో ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. దారిలోనే కుమారి కవలలకు జన్మనిచ్చింది. వెంటనే వైద్యుడు నరేశ్ వైద్యం అందించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.