కోర్టు ధిక్కార పిటిషన్ పై.. హైకోర్టు వ్యాఖ్యల దృష్ట్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణం రాజీనామా చేయాలని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ పై విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని.. ముఖ్యమంత్రికి నైతిక విలువలుంటే..తక్షణమే రాజీనామా చేయాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు. అందుకు ఒక ప్రకటన విడుదల చేశారు.
నైతిక విలువలు ఉంటే సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలి: తులసిరెడ్డి
హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంశంపై ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి స్పందించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు. నైతిక విలువలు ఉంటే సీఎం జగన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
tulasi reddy
ప్రభుత్వాలకు న్యాయస్థానం తీర్పు ప్రతికూలంగా వ్యాఖ్యానించినందుకు.. 1964లో బస్సుల జాతీయకరణ అంశంపై కాంగ్రెస్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, 1992లో మెడికల్, డెంటల్ కళాశాల మంజూరుపై కాంగ్రెస్ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి.. తమ పదవులకు రాజీనామా చేసి నైతిక విలువలు కాపాడుకున్నారని అన్నారు.
ఇదీ చదవండి:అక్రమ నగదు తరలింపు... మంత్రి బాలినేని చుట్టూ వివాదం