ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్​కు ముందస్తు బెయిల్ - tv9 issue

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. 3 కేసుల్లో షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

రవిప్రకాశ్

By

Published : Jul 12, 2019, 4:09 PM IST

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. 3 కేసుల్లో షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఫోర్జరీ, నిధుల మళ్లింపు, టీవీ 9 ట్రేడ్‌మార్క్‌, కాపీరైట్లను అక్రమంగా విక్రయించారని అలంద మీడియా ఫిర్యాదుతో రవిప్రకాశ్‌తోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది. గతంలో దర్యాప్తునకు హాజరైన ఆయన... సరైన రీతిలో సహకరించలేదని పోలీసులు తెలిపారు. ఈ కారణంతో రవిప్రకాశ్​ను అరెస్ట్ చేసే అవకాశమున్న నేపథ్యంలో... ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details